రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. మరికొన్ని గంటల్లో భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రం ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.

Update: 2024-07-06 11:39 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రం ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి, వనపర్తి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో ఇవాళ సాయంత్రం, రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో పైన తెలిపిన జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు రోజుల్లో భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు కూడా విస్తాయని తెలపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే జిల్లా యంత్రంగాలను అప్రమత్తం చేశారు. వర్షాలు కురిసే సమయంలో ఎవరు బయటకు వెళ్లోద్దని.. ముఖ్యంగా విద్యుత్ స్థంబాలకు దూరంగా ఉండాలని, నగరాల్లో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు కోరుతున్నారు.


Similar News