ALERT : తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్

ఎండా కాలం వేడి, ఉక్కపోతతో అల్లాడిన జనం వాతావరణం చల్లబడటంతో కాస్తా ఊపిరి పీల్చుకుంటున్నారు.

Update: 2024-06-06 05:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎండా కాలం వేడి, ఉక్కపోతతో అల్లాడిన జనం వాతావరణం చల్లబడటంతో కాస్తా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. అయితే నైరుతి రాకతో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే చాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిసింది. నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. గంటలకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

వచ్చే 3, 4న రోజుల్లో నైరుతి రుతుపవనాలు కోస్తాంద్రలోని పలు ప్రాంతాల్లో ప్రవేశించే చాన్స్ ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలోని కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, హైదరబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే చాన్స్ ఉన్నట్లు పేర్కొంది. నైరుతి రుతపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చురుకుగా కదలడంతో రానున్న 3, 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.


Similar News