ALERT : నేటి నుంచి పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

సౌత్ సెంట్రల్ రైల్వే నగర ప్రజలకు కీలక సూచన చేసింది.

Update: 2023-06-19 05:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ సెంట్రల్ రైల్వే నగర ప్రజలకు కీలక సూచన చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల పనుల కారణంగా ఈ నెల 19 నుంచి 25 వరకు పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేయనున్నట్లు తెలిపింది. ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించింది. వారం రోజుల పాటు 28 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. 6 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. గుంతకల్ - భోదన్ రైలు సర్వీస్ ను రీ షెడ్యూల్ చేశారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..