Rain Alert:తెలంగాణ వాసులకు అలర్ట్..నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కారణంగా మోస్తారు వర్షాలు కురిశాయి. అయితే పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కారణంగా మోస్తారు వర్షాలు కురిశాయి. అయితే పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో మళ్లీ సోమవారం నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని జలశాయాలు నిండుకుండాలా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది. నేడు(శుక్రవారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ తదితర జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.