తెలంగాణలో ఆ పార్టీ ఓటమి ఖాయం.. MIM చీఫ్ ఒవైసీ జోస్యం
రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. పొత్తులతో పాటు దక్కించుకోవాల్సిన సీట్లపై లెక్కలు వేసుకుంటున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. పొత్తులతో పాటు దక్కించుకోవాల్సిన సీట్లపై లెక్కలు వేసుకుంటున్నాయి. తాజాగా 2024 లోక్‌సభ ఎన్నికలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఔరంగాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని ఇతర స్థానాల నుంచి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. అయితే ఏ పార్టీతో పొత్తు అనేది తొందరపాటు చర్య అవుతుందని అన్నారు. సమయం వచ్చినప్పుడు పొత్తులపై ప్రకటన చేస్తామన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ 2014తో పాటు 2018లోనూ ఓటమి పాలైందని అన్నారు. రాబోయే 2023 ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఒటమి తప్పదని జోస్యం చెప్పారు. ముస్లిం సమాజంపై కొంతమంది విద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారని అయినప్పటికీ అలాంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. ముఖ్యంగా రాజస్థాన్ ప్రభుత్వ పెద్దలకు భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు కానీ జునైద్, నసీర్‌లను హత్య చేసిన ప్రదేశానికి మాత్రం వెళ్లేందుకు మనసురావడం లేదన్నారు.
In Telangana, BJP lost the 2014 and 2018 elections. This year also, in December 2023 BJP will lose the Telangana elections again. Give us some credit for that: Asaduddin Owaisi on Regional alliances coming together can defeat BJP
— ANI (@ANI) February 25, 2023