టికెట్ల విషయంలో విభేదాలు వద్దు.. ఏఐసీసీ కార్యదర్శి కీలక సూచనలు
అసెంబ్లీ టికెట్ల కేటాయింపుల విషయంలో పార్టీలో ఏమైనా
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ టికెట్ల కేటాయింపుల విషయంలో పార్టీలో ఏమైనా విభేదాలు ఉంటే.. అంతర్గత వేదికల మీద మాత్రమే మాట్లాడాలనివాఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్ సూచించారు. పార్టీ టికెట్ల కేటాయింపుల విషయంలో ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయని, ఆశావాహులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. పార్టీ అందరికీ న్యాయం చేసే విధంగా ముందుకు పోతుందన్నారు. పార్టీ గెలుపు కోసం అందరం కలిసి గెలుపు కోసం కృషి చేయాలన్నారు.
టికెట్ల కేటాయింపుల వ్యవహారం ఇంకా ముగియలేదని క్లారిటీ ఇచ్చారు. టికెట్ల కేటాయింపుల విషయంలో ఏ నాయకులు కూడా పార్టీకి వ్యతిరేకంగా కానీ, నాయకులకు వ్యతిరేకంగా కానీ బహిరంగంగా మాట్లాడవద్దని ఆదేశించారు. పత్రిక సమావేశాలు, ప్రకటనలు ఇస్తూ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా, పార్టీ నాయకుల మీద బహిరంగంగా మాట్లాడవద్దన్నారు. "పార్టీ టికెట్ల కేటాయింపుల విషయంలో కొందరు నాయకులు ప్రెస్ మీట్స్ పెట్టి మాట్లాడుతున్నారు., ప్రకటనలు చేస్తున్నారు, అలా చేయడం పార్టీ విధానాలకు వ్యతిరేకం. ఎలాంటి సమస్యలున్నా పార్టీ దృష్టికి తీసుకురావాలి.. "అని మన్సూర్ అలీఖాన్ పేర్కోన్నారు..