Aerial Survey: ఒకే హెలికాప్టర్ లో బండి, భట్టి.. ఖమ్మంలో ఏరియల్ సర్వే
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రుల బృందం ఏరియల్ సర్వే నిర్వహించింది.
దిశ, డైనమిక్ బ్యూరో : ఇటీవల భారీ వర్షాలకు అతలాకుతలం అయిన ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని ఇవాళ కేంద్ర బృందం పరిశీలించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజయవాడకు హెలికాప్టర్‌లో వెళ్లి అక్కడి నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్‌తో కలిసి వరద నష్టంపై ఖమ్మంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. సర్వేలో మంత్రులు పొంగులేటి, తుమ్మల సైతం పాల్గొన్నారు. కూసుమంచి, పాలేరులో వరదల వల్ల నష్టపోయిన రైతులతో మాట్లాడారు. వరద ముంపు తీవ్రతను మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వివరించారు. అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. ఇక్కడ సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి శివరాజ్ సింగ్‌తో భేటీ కానున్నారు. వరద నష్టం, కేంద్ర సహాయంపై చర్చించనున్నారు.