డీఎస్సీ వాయిదా పిటిషన్ విచారణ పోస్ట్ పోన్

డీఎస్సీ వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.

Update: 2024-07-18 09:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ జులై 28కి వాయిదా పడింది. డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ పది మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై గురువారం న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా విద్యార్థుల తరపున సీనియర్ అడ్వకేట్ రవిచందర్ వాదనలు వినిపించారు. నోటిఫికేషన్ కు పరీక్షకు మధ్య నాలుగు నెలల సమయం మాత్రమే ఇచ్చారని, ఈ నాలుగు నెలల వ్యవధిలో ఇతర అనేక పరీక్షలు రాశారన్నారు. సమయాభావం వల్ల పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు అనేక ఆందోళనలు చేశారని కోర్టుకు తెలిపారు. గ్రూప్-1 పరీక్షను కూడా ఇదే రీతిలో నిర్వహించి అభ్యర్థులను గందరగోళానికి గురి చేశారని తెలిపారు. ఇక ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పది మంది కోసం 2.45 లక్షల మంది నిరుద్యోగులను బలి చేయలేమని పేర్కొన్నారు. టెట్ పరీక్షకు డీఎస్సీకి తగిన సమయం ఉందన్నారు. పరీక్షల కోసం లక్షల మంది నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యారని కోర్టుకు వివరించారు. పిటిషన్ వేసిన పది మంది డీఎస్సీ పరీక్షకు దరఖాస్తు చేశారా అని కోర్టు ప్రశ్నించింది. గ్రూప్ -1 తో పాటు డీఏవో, డీఎస్సీకి అప్లై చేశారని పిటిషనర్ల తరపున న్యాయవాది వెళ్లడించగా పిటిషన్ దాఖలు చేసి ఒకరు కూడా డీఎస్సీ హాల్ టికెట్లు సబ్మిట్ చేయకపోవడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. కాగా మరో వైపు డీఎస్సీ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం అయ్యారు. ఆగస్టు 5న ఎగ్జామ్స్ ముగియనున్నాయి.

Tags:    

Similar News