ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి ఆత్మహత్య

వ్యాపార రంగంతో తక్కువ వ్యవధిలోనే ఆ యువకుడు అగ్ర స్థానానికి ఎగబాకాడు.

Update: 2023-04-08 09:47 GMT

దిశ, బైంసా: వ్యాపార రంగంతో తక్కువ వ్యవధిలోనే ఆ వ్యాపారి అగ్ర స్థానానికి ఎగబాకాడు. ఆశించిన మేర లాభాలు గడిస్తూ మార్కెట్లో సుస్థిరమైన స్థానం సంపాదించాడు. ఈ క్రమంలో అత్యాశకు పోయి బెట్టింగ్ లకు అలావాటు పడి, మద్యానికి బానిసై ఆయువకుడు తనువు చాలించిన ఘటన బైంసా పట్టణంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని మహాలక్ష్మీ జ్యువెల్లరీ అధినేత సాతం నుందు రెండో కుమారుడు సాతం సంజీవ్ తన తండ్రితో కలిసి బంగారు, వెండి అభరణాల షాప్ ను నిర్వహించేవాడు.

ఈ క్రమంలోనే వారి వ్యాపారం అనతి కాలంలోనే మార్కెట్ లో పేరు, ప్రఖ్యాతలు సంపాదించారు. ఈ నేపథ్యంలో సంజీవ్ కు బెట్టింగ్ లకు అవాటుపడ్డాడు. మద్యం తాగడం కూడా అలవాటైపోయింది. దీంతో సంజీవ్ ఆస్తులు మంచులా కరిగిపోయాయి. బయట అప్పులు కూడా చేశాడు. దీంతో తన కుమారుడి పరిస్థితి చేదాటిపోతుండడాన్న తండ్రి సాతం నందు తన కుటుంబ సభ్యులతో కలిసి సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాడు. కొడుకు చేసిన అప్పులు తీర్చి మరోమారు తప్పటడుగులు వేయకుండా సరియైన మార్గంలో నడువాలంటూ కుమారుడికి హితవు పలికాడు. కొంత కాలం బాగానే వ్యాపారాన్ని నడిపిన సంజీవ్ మళ్లీ పాత పద్ధతిలోనే నడిచాడు.

దీంతో వ్యాపారానికి దూరమై, బెట్టింగ్, తాగుడుకు బానిసగా మారి అందులోనే మునిగి తేలాడు. దీంతో అప్పులు పెరిగి అవి తీర్చే మార్గం అతనికి కనిపించలేదు. అతని భార్య, పిల్లలు కూడా దూరమయ్యారు. దీంతో మానిసిక ఒత్తిడి తట్టకోలేక శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సంజీవ్ చున్నీతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ పరిణామంలో భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఒంటిరి వాళ్లుగా మిగిలిపోయారు. మృతదేహాం వద్ద భార్యతో పాటు ఇద్దరు కుమారులు రోదిస్తున్న తీరు పరువురుని కంటతడి పెట్టించింది.

Tags:    

Similar News