పనులు వేగంగా పూర్తి చేయాలి
ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయ సమీపంలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు.
దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయ సమీపంలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో గత ఏడాది ప్రారంభమైన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు కొన్ని కారణాలతో ఆగిపోయాయి. మళ్లీ ప్రారంభమైన ఆ పనులను పరిశీలించారు.
పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఓవర్ బ్రిడ్జి పూర్తి కాకపోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. భూ సేకరణ కూడా పూర్తి చేసి గడువులోగా పనులు కంప్లీట్ చేయాలన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జోగు రవి, అశోక్ రెడ్డి ఉన్నారు.