తాగుబోతులకు అడ్డాగా బోథ్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్..
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానం
దిశ,బోథ్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానం తాగుబోతుల కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఉదయం సమయంలో కాలేజీకి వస్తున్న లెక్చరర్లకు, విద్యార్థులకు విచ్చలవిడిగా పడి ఉన్న బీర్ బాటిల్ లు,తినుబండారాల ప్యాకెట్ లు దర్శనమిస్తున్నాయి. తాగిన మైకంలో బీరు బాటిళ్లు అక్కడే పలగొట్టడం వల్ల ఏర్పడిన గాజు పెంకులు గుచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఉదయం పూట మైదానంలో నడకకు వచ్చేవారు తెలిపారు. త్వరలో జరగబోయే సీఎం కప్ క్రీడా పోటీలు ఈ మైదానంలోనే జరగనున్నాయని సమాచారం.రాత్రి సమయంలో మైదానంలో ఎటువంటి లైటింగ్ లేకపోవడంతో తాగుబోతులకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా మైదానంలో లైటింగ్ ఏర్పాటు చేయాలని కాలేజీ మైదానం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని విద్యార్థులు,ప్రజలు కోరుతున్నారు.