పాత సర్వే పైసలు ఇస్తేనే కొత్త సర్వే చేస్తాం

గతంలో చేసిన లెప్రసీ, ఎండీఏ సర్వే డబ్బులే ఇప్పటికి ఇవ్వలేదని ఆశవర్కలు తెలిపారు.

Update: 2024-03-11 16:57 GMT

దిశ, మంచిర్యాల టౌన్ : గతంలో చేసిన లెప్రసీ, ఎండీఏ సర్వే డబ్బులే ఇప్పటికి ఇవ్వలేదని ఆశావర్కర్లు తెలిపారు. మళ్ళీ లెప్రసీ సర్వే చేయమంటున్నారని, గతంలో చేసిన సర్వే చేసినందుకు ఆశ కార్యకర్తలకు రావలసిన డబ్బులు తిరిగి ఇస్తేనే సర్వే చేస్తామని మంచిర్యాల జిల్లాలో పలువురు ఆశ కార్యకర్తలు మంచిర్యాల జిల్లా వైద్య అధికారి డా . సుబ్బారాయుడుకి వినతి పత్రం అందించారు . 2023 సెప్టెంబర్‌లో లెప్రసీ, ఎండీఏకు సంబంధించిన పూర్తి సర్వే చేసి అధికారులకు రిపోర్ట్ అంజేశామని ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా రాలేదని, ఇప్పటికే చాలీచాలని జీతంతో గడుస్తున్నా మా జీవితాలకు సర్వేల పేరుతో చేసిన ఖర్చుల డబ్బులను ఇప్పించాలని వారు కోరారు. రేపటి నుంచి జరిగే లెప్రసీ సర్వేలో ఆశ కార్యకర్తలు ఎవరు పాల్గొనమని వారు తెలిపారు.


Similar News