ఓటు వేయని ఎంగ్లపూర్ గ్రామస్తులు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం పెంబి మండలంలోని ఎంగ్లపూర్ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని, నాలుగు గ్రామల ప్రజలు ఓటును బహిష్కరిస్తున్నట్లు బుధవారం రోజున రోడ్డు పై బటాయించారు.
దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం పెంబి మండలంలోని ఎంగ్లపూర్ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని, నాలుగు గ్రామల ప్రజలు ఓటును బహిష్కరిస్తున్నట్లు బుధవారం రోజున రోడ్డు పై బటాయించారు. గురువారం ఎలక్షన్ సిబ్బంది తమ విధులు నిర్వహిస్తున్నా గ్రామస్తులు మాత్రం 12 గంటలు అయిన ఓటు హక్కును వినియోగించకుండా వంటవార్పులు చేశారు. జిల్లా కలెక్టర్ గ్రామస్తులతో చారవాణిలో మాట్లాడగా గ్రామస్తులు మాత్రం ససేమిరా అంటున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేంత వరకు ఓటు వేయమని గ్రామస్తులు అన్నారు. ఓటు వేయడానికి గ్రామస్తులు రాకపోవడంతోఎలక్షన్ సిబ్బంది మాత్రం ఖాళీగా కూర్చున్నారు.