దిశ, ఖానాపూర్: ఉపాధి హామీ పథకం సభలో గ్రామస్తులు ఆందోళనకు దిగిన ఘటన సతనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సతనపల్లి గ్రామంలో 44 గ్రూపులు లోని కూలీలు 2019 సంవత్సరం లో ఉపాధి హామీ కూలీ పనిచేయగా.. నాలుగు వారాల వేతనాలు ఇంకా రావడం లేదని ఆందోళన చేపట్టారు. పంచాయతీ సెక్రెటరీ, టెక్నీకల్ అస్టెంట్ నిర్లక్ష్యం కారణం అని ఆందోళన చేపట్టారు. ఎంపీపీ మొహిద్ జోక్యం చేసుకుని కూలి డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచ్‌లు పర్సాపు శ్రీనివాస్, సిరాల లక్ష్మి, టెక్ట్నికల్ అసిస్టెంట్ రమేష్, ఆయా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.