ఆ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిందే మోడీ.. అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు
డిసెంబర్ 3న తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్రహోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు...
దిశ, వెబ్ డెస్క్: డిసెంబర్ 3న తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్రహోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. ఆదిలాబాద్‌లో ఆయన పర్యటించారు. బీజేపీ ఏర్పాటు చేసిన జనగర్జన సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రతి జిల్లాలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. దేశంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నడుస్తోందని.. తెలంగాణలో కూడా అదే సర్కార్ అవసరమని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే దేశంలోనూ, రాష్ట్రంలోనూ మోడీనే అని అర్థమన్నారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ కడతామంటే 10 ఏళ్ల పాటు సీఎం కేసీఆర్ స్థలం ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. పసుపు రైతుల కోసం త్వరలో పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నామని అమిత్ షా తెలిపారు. ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంచాయితీని తీర్చేందుకు ప్రధాని మోడీయే కృష్ణా జలాల వాటా కోసం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ప్రధాని మోడీనే తీసుకొచ్చారని కేంద్రహోంమంత్రి అమిత్ షా తెలిపారు.