అధికారుల చొరవతో ఓటు వేసిన గిరిజనులు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి మండలంలోని గుమ్మనా ఎంగ్లాపూర్ గ్రామపంచాయతీలోని గిరిజనులు గురువారం రోజున 226 పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలు అయిపోయిన తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా నిరసన వ్యక్తం చేశారు.
దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి మండలంలోని గుమ్మనా ఎంగ్లాపూర్ గ్రామపంచాయతీలోని గిరిజనులు గురువారం రోజున 226 పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలు అయిపోయిన తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమగ్రామానికి రోడ్డు సౌకర్యం లేక నాన ఇబ్బందులు పడుతున్న ఏ రాజకీయ నాయకులు గ్రామని పట్టించుకోవడం లేదని అందుకే ఓటు వేయకుండా నిరసన తెలుపుతునట్లు ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ ఎంగ్లపూర్ గ్రామానికి చేరుకొని గ్రామంలోని గిరిజనులతో మాట్లాడుతూ తమగ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పై ప్రభుత్వానికి నివేదిక అందిస్తానని తెలిపారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాని అన్నారు. ఎట్టకేలకు జిల్లా అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ గ్రామస్తులను ఓటింగ్ కు ఒప్పించారు. అనంతరం గ్రామస్తులు 226 పోలింగ్ బూత్ లో 402 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోను ఉన్నారు.