పరిమితికి మించి ప్రయాణం.. బస్సును నిలిపివేసి పొన్కల్ గ్రామస్తులు

బస్సులో పరిమితికి మించి ప్రతిరోజు ప్రయాణం చేస్తుండడంతో భయం

Update: 2024-07-02 09:37 GMT

దిశ,మామడ : బస్సులో పరిమితికి మించి ప్రతిరోజు ప్రయాణం చేస్తుండడంతో భయం వేస్తుందని గ్రామస్తులు ,విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని పొన్కల్ గ్రామంలో గ్రామస్తులు , విద్యార్థులు బస్సును నిలిపివేసి ధర్నా చేశారు. మండలంలోనే అతిపెద్ద గ్రామమైన పొన్కల్ మీదుగా కమల్ కోట్ వరకు ఒకే బస్సు అయిదు ట్రీపులు నడపడంతో గ్రామంతో పాటు చుట్టుపక్క గ్రామాలైన ఆదర్శనగర్, న్యూటెంబరేనీ, పోతారం, అనంతపెట్, బండల ఖానాపూర్ ,చందరం గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రతినిత్యం వివిధ పనుల నిమిత్తం నిర్మల్ కు వెళుతుంటారు.

సరైన బస్సులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ,పలుమార్లు డీఎంకు విన్నవించిన పెడచెవిన పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణం చేస్తుంటే ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులని , సంఘటనలు జరగకముందే సమస్యను పరిష్కరించాలని వారు పేర్కొన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి అదనపు బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు ,చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Similar News