వైద్యుల నిర్లక్ష్యంతో పుట్టిన శిశువు మృతి

వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పుట్టిన శిశువు మృతి చెందిందని

Update: 2024-07-04 10:25 GMT

దిశ, కాగజ్ నగర్ : వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పుట్టిన శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు చేపట్టిన ఆందోళన గురువారం కిమ్స్ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమకు న్యాయం చేయాలంటూ ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి న్యాయం జరిగే వరకు కదిలేది లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న సీఐ శంకరయ్య సంఘటన స్థలానికి చేరుకోవడంతో పోలీసుల ముందు బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ తమ గోడును వెల్లబోసుకున్నారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొమురం భీం జిల్లా దహెగాం మండలం కలవాడు గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ ఇస్తారావత్. సవిత తన భర్త రమేష్ తో కలిసి ఈనెల 1వ తేదీ సోమవారం కాగజ్ నగర్ పట్టణంలోని కిమ్స్ హాస్పిటల్ కి వచ్చినట్లు తెలిపారు.

వైద్యులు తల్లి కడుపులో బిడ్డ బాగా లేరని హాస్పిటల్ లో అడ్మిట్ అవుతారా అని చెప్పడంతో అడ్మిట్ అయ్యామని తెలిపారు.మరుసటి రోజు నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి కొంత సమయం తర్వాత మళ్లీ ఆపరేషన్ చేయాలని తెలుపడంతో నా భార్యకు ఇంకా 9 నెలలు నిండలేదని మంచిర్యాల్ ఆసుపత్రి వాళ్లు ఇచ్చిన డెలివరీ డేట్ ఈనెల 24వ తేదీ ఉందని నా దగ్గర డబ్బులు లేవని వైద్యులకు మొరపెట్టుకున్నట్లు బాధను వెల్లబోసుకున్నారు. ఇంజక్షన్ వేసి నొప్పులు వస్తున్నాయని చెప్పడం తో నేను మంచిర్యాల్ ఆసుపత్రికి తీసుకువెళ్దామనే లోపే డెలివరీ ఇక్కడే అవుతుంది అని అబ్జర్వేషన్ లో ఉంచి డబ్బులు తేవాలని ఇబ్బందులకు గురిచేసినట్లు వాపోయారు.మంగళవారం రాత్రి 10 గంటలకు ఆపరేషన్ చేసినట్లు బాధితులు తెలిపారు. పుట్టిన శిశువుని రాత్రి ఓ పిల్లల ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు శిశువు ఆరోగ్యంగా ఉందని చెప్పడంతో పాపను ఆసుపత్రికి తీసుకువచ్చి ఇక్కడే ఉన్నామన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు పాపా చనిపోయి ఉండడంతో ఆసుపత్రిలో ఏ ఒక్క వైద్యులు లేరన్నారు. ఆసుపత్రి ఇంచార్జ్ కూడా రాలేదన్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లు హాస్పిటల్ కి వచ్చి మేము ఉన్నామంటూ మేము చూసుకుంటాం అని చెప్పాగా ఉదయం 5 గంటల వరకు కూడా ఏ ఒక్కరూ రాలేదని రోదించారు. సమాచారం తెలుసుకున్న పట్టణ సీఐ శంకరయ్య ఘటన స్థలానికి చేరుకోవడం తో బాధితులు పుట్టిన పాప మృతి చెందడానికి కారణం హాస్పిటల్ వైద్యులే కారణం అంటూ విషయాన్ని తెలియజేశారు.

న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని చెప్పడంతో సీఐ బాధితులను కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదని అడగడంతో డబ్బులు ఉన్నవారికి ఒక న్యాయం లేని వారికి ఒక న్యాయమా అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మీకు సమాచారం తెలియందే హాస్పిటల్ కు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారా అని బాధితులు సీఐ ని ప్రశ్నించారు.? నేను పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ అడిగారు. కొద్దిసేపు బాధితులకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 24వ తేదీన డెలివరీ డేట్ మంచిర్యాల్ హాస్పిటల్ వాళ్లు ఇచ్చినట్లు రిపోర్ట్ లు ఉన్నప్పటికీ డబ్బుల కోసమే నా భార్యకు ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ సీఐ హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.

నాయకునికి సంబంధించిన హాస్పిటల్ కావడంతోనేనా..

కాగజ్ నగర్ పట్టణంలోని కిమ్స్ ప్రైవేట్ ఆస్పత్రి ఓ బడా నాయకుడు కు చెందినది కావడంతో ఆస్పత్రి వద్ద ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో శిశువు మృతి చెందిన సమాచారాన్ని బయటకు పొక్క కుండ రాత్రికి రాత్రే సమాచారం పోలీసులకు చేరవేసి ఆసుపత్రి కి ఉదయం వరకు వైద్యులు రాకుండా చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతి చెందిన శిశువుతో కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.


Similar News