చేపల వాహనంలో మద్యం తరలింపు

మంచిర్యాల జిల్లా ఇందారం నీలిమ వైన్స్ నుంచి బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం తరలిస్తుండగా మంగళవారం జైపూర్ బ్లూ కోట్ పోలీసులు పట్టుకున్నారు.

Update: 2024-12-17 11:50 GMT

దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా ఇందారం నీలిమ వైన్స్ నుంచి బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం తరలిస్తుండగా మంగళవారం జైపూర్ బ్లూ కోట్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే ఇందారం నీలిమ వైన్స్ నుంచి టేకుమట్ల బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు రామగుండం కమిషనర్ కు అందిన పక్కా సమాచారంతో అప్రమత్తం అయిన బ్లూ కోట్ పోలీసులు అక్రమంగా మద్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. ముదిరాజులకు సబ్సిడీ కింద చేపల వ్యాపారానికి మంజూరు చేసిన వాహనంలో మద్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. 


Similar News