మందమర్రి మండలంలో పులి సంచారం.. భయాందోళనలో స్థానికులు..

మందమర్రి మండలంలో పులి సంచారం చేస్తుండటంతో మండల వాసులు భయాందోళన చెందుతున్నారు.

Update: 2024-12-19 07:57 GMT

దిశ, రామకృష్ణాపూర్ : మందమర్రి మండలంలో పులి సంచారం చేస్తుండటంతో మండల వాసులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల అందుగుల పేట గ్రామశివారులో రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం చేల వద్దకు వెళ్లగా పులి గాండ్రింపులు విని రైతులు భయపడి ఇంటికి తిరిగి వచ్చినట్లు సమాచారం. బుధవారం పాత మంచిర్యాల సెక్షన్ పరిధిలోని సఫారీ రోడ్ మీద కెమెరాకు పులి చిత్రం ట్రాప్ అయిందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

పులి పాదముద్రలు సేకరణ కూడా జరిగిందని, అది ఆడ పులిగా గుర్తించినట్లు తెలిపారు. కాగా పులి అందుగుల పేట నుండి పాత మంచిర్యాల సెక్షన్ పరిధిలోని బొక్కల గుట్ట, తిమ్మాపూర్, పాత మంచిర్యాల మీదగా ముల్కల్ల బీట్ ప్రాంతంలో సంచరిస్తుందని తెలిపారు. కావున ముల్కల్ల చుట్టుపక్కల ప్రజలు, మేకల కాపరులు, పశువుల కాపరులు అటు వైపు వెళ్లవద్దని, వ్యవసాయ క్షేత్రాల వద్ద ఎలాంటి కరెంట్ తీగలు అమర్చవద్దని హెచ్చరిస్తున్నారు.


Similar News