మాకాడిలో పులి సంచారం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ టి మండలం మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలైన మాకాడి, అనుర్ శివారులో పెద్దపులి సంచరిస్తుంది.
దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ టి మండలం మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలైన మాకాడి, అనుర్ శివారులో పెద్దపులి సంచరిస్తుంది. దాంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బుధవారం మాకాడి, అనుర్ అటవీప్రాంతంలో పెద్దపులి రైలు పట్టాలు దాటుతూ స్థానికులకు కనిపించింది. దాంతో వీడియా తీసి సొషల్ మీడియాలో పెట్టారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.