యాదవుల సమస్యలు పరిష్కరించండి
యాదవుల సమస్యలు పరిష్కరించండి అని ముఖ్యమంత్రికి మంచిర్యాల జిల్లా అఖిల భారత యాదవ సంఘం అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్, వినోద్ నేతృత్వంలో విజ్ఞప్తి చేశారు.
దిశ, మందమర్రి : యాదవుల సమస్యలు పరిష్కరించండి అని ముఖ్యమంత్రికి మంచిర్యాల జిల్లా అఖిల భారత యాదవ సంఘం అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్, వినోద్ నేతృత్వంలో విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం మంచిర్యాల జిల్లాలో 7833 యూనిట్లకు పూర్తి స్థాయిలో గొర్రెల పంపిణీ చేశారని, రెండవ విడతలో కూడా పూర్తి స్థాయి పంపిణీ జరగాల్సి ఉన్నా 2500 యూనిట్లకు మాత్రమే డీడీలు కట్టించి 700 యూనిట్లకు మాత్రమే గొర్రెలు పంపిణీ చేశారని తెలిపారు.
1800 యూనిట్లకు ఎలాంటి పరిహారం ఇవ్వకపోగా వడ్డీ ఇవ్వకుండా కేవలం అసలు మాత్రమే వాళ్ల ఖాతాలలో జామ చేశారు అని తెలిపారు. దీని వల్ల చాలా మంది యాదవ్ లు నష్ట పోయారని తెలిపారు. ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ మూడు సంవత్సరాలుగా ఇవ్వలేదని, ఇప్పటికైనా ప్రారంభించాలని కోరారు. యాదవ సొసైటీ జిల్లాల వారీగా ఎన్నుకొని జిల్లా చైర్మన్ లను నియమించాలని, జిల్లా కేంద్రంలో యాదవ సంక్షేమ భవనం నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం జనరల్ సెక్రటరీ మల్లెతుల నరేష్ యాదవ్, రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు బండి శివకుమార్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎరవేని కిట్టన్న యాదవ్, సతేన్న యాదవ్, మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు.