మొబైల్ యాప్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొబైల్ యాప్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

Update: 2024-12-18 13:51 GMT

దిశ, ఆదిలాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొబైల్ యాప్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ వార్డ్ నెంబర్ 44, 49 లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి నమోదు చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వేయర్లు ఇంటింటికీ తిరుగుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న అర్జీదారుల వివరాలను సేకరిస్తున్న తీరును పరిశీలించి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

    రోజువారీ లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ఇందులో భాగంగా ఎన్ని కుటుంబాల వివరాలు నమోదు చేశారు, సర్వే సందర్భంగా యాప్ ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ, పొరపాట్లకు తావులేకుండా దరఖాస్తుదారుల వివరాలను ఆన్లైన్ మొబైల్ యాప్ లో జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహించకుండా ఈ నెలాఖరులోగా సర్వే పూర్తయ్యేలా వేగవంతం చేయాలని అన్నారు. కలెక్టర్ తో మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, సర్వేయర్లు తదితరులు ఉన్నారు.


Similar News