గిరి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

జిల్లాలోని గిరి గ్రామాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.

Update: 2024-12-18 15:21 GMT

దిశ, ఆసిఫాబాద్ : జిల్లాలోని గిరి గ్రామాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లో ఐటీడీఏ పీఓ ఖుష్బూగుప్తా, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీఎఫ్ఓ నీరజ్ కుమార్తో కలిసి ఆదివాసీ నాయకులతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. రవాణా సౌకర్యాలు లేని గిరి గ్రామాలకు రోడ్డు, వంతెనలు నిర్మించాలన్నారు.

    అటవీ అనుమతులు పొందేలా ప్రతిపాదనలు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న భూ వివాదాలను జాయింట్ సర్వే నిర్వహించి దశలవారీగా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే పోడు భూములు సాగు చేస్తున్న అర్షులైన రైతులను గుర్తించి పోడు పట్టాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 


Similar News