పెద్దపులి, చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు..
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో చిరుత, పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది.
దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో చిరుత, పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. కాసిపేట మండలం గురువాపూర్, పెద్ద ధర్మారం శివారు అటవి ప్రాంతంలో జంట పులుల సంచారం గ్రామస్తులను కలవరపెడుతుంది. గురువాపూర్ శివారు అడవుల్లో పెద్దపులి, చిరుత పులుల పాదముద్రలను గ్రామస్తులకు కనిపించాయి.
ఈ రెండు పులులు వారం క్రితం కూడా ఇదే ప్రాంతంలో సంచరించినట్టు గ్రామస్తులు తెలిపారు. పులుల సంచారాన్ని అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. పులుల సంచారాన్ని గుర్తించేందుకు అటవి ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సమీప గ్రామాల ప్రజల్లో జంట పులుల సంచారంతో గ్రామస్తులు బెంబేలు పడుతున్నారు.