పేదల సంక్షేమానికి పెద్దపీట : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఖానాపూర్
దిశ, పెంబి: పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. బుధవారం పెంబి మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో 12 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. కళ్యాణ్ లక్ష్మి , షాదీ ముబారక్ పథకం వల్ల పేదలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.