ఓటరు జాబితా సర్వే పకడ్బందీగా చేయాలి

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో చేపట్టిన ఓటరు జాబితా రూపకల్పన ఇంటింటి సర్వేను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

Update: 2024-09-14 14:20 GMT

దిశ,బెల్లంపల్లి : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో చేపట్టిన ఓటరు జాబితా రూపకల్పన ఇంటింటి సర్వేను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం మంచిరాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కొనసాగుతున్న ఇంటింటి సర్వేను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఓటరు జాబితా రూపొందించడంలో అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టమైన జాబితా తయారు చేసేలా పోలింగ్ కేంద్రాల ఏజెంట్లు సమన్వయంతో కృషి చేయాలని కోరారు.

    నూతన ఓటరు నమోదు, మార్పులు, సవరణలు, తొలగింపునకు అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో తగు విచారణ జరిపి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. చిరునామా మార్పులపై ప్రత్యేక దృష్టి సారించాలని, మరణించిన వారి వివరాలు తొలగించేందుకు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News