భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ఏర్పాటు

భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Update: 2023-04-16 06:35 GMT

దిశ, భైంసా: రెవెన్యూ డివిజన్ కేంద్రమైన బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ నియమాకం జరిగింది. లోకేశ్వరం మండలానికి చెందిన రాజేష్ బాబు చైర్మన్ గా , బైంసాకు చెందిన జేకే సుదర్శన్ పాటిల్ వైస్ చైర్మన్ గా నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు మరో 16 మంది డైరెరక్టర్లు గా నియమిస్తు శనివారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.రఘునందన్ రావ్ సంబంధిత ఉత్తర్వులను జారీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఇప్పటి వరకు మూడు పాలక వర్గాల నియమాకం జరిగింది.

రిజర్వేషన్ల ప్రకారం తొలుత ఎస్సీ మహిళ, తదుపరి బీసీ మహిళ, అటు తరువాత బీసీ జనరల్ వర్గాలకు చెందిన వ్యక్తులు మార్కెట్ కమిటీ చైర్మెన్లుగా నియమితులయ్యారు. నాలుగవ పర్యాయం చైర్మెన్ స్థానం ఎస్టీ వర్గానికి కేటాయించారు. దీంతో ఆ వర్గానికి చెందిన లోకేశ్వరం మండంలోని రాజేష్ తండా నివాసి రాజేష్ బాబు తాజాగా ప్రకటించిన నూతన పాలక వర్గంలో చైర్మెన్ గా నియమితులయ్యారు. ఇక భైంసా పట్టణంలోని శివాజీనగర్ చెందిన ఆరే మరాఠ సంఘం జిల్లా అధ్యకుడైన జేకే సుదర్శన్ పాటిల్ వైస్ చైర్మెన్ గా నియమింపబడ్డారు. వచ్చే వారం నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారం జరిగే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News