రైతుబంధును అడ్డుకుంటున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి
తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులు కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు ను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
దిశ, తాండూర్ : తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులు కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు ను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. తాండూర్ ఐబి లో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకులు మాట్లాడుతూ రైతు బంధు నిధుల విడుదలపై ఎన్నికల కమిషన్ (ఈసీ)కు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. రైతు బంధుపై అన్నదాతల ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఎప్పటిలాగే ప్రభుత్వం యాసంగి పంట సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తుందన్నారు. రైతులకు పంట పెట్టుబడికి ఉపయోగపడే రైతుబంధును కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవాలని చూడడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రణయ్ కుమార్, జెడ్పిటిసి బానయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మహేందర్ రావు, నాయకులు సిరంగి శంకర్, రాజేశం, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.