దాడి చేసిన వారిపై తీన్మార్ మల్లన్న టీం సభ్యుల ఫిర్యాదు..
క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న పై, కార్యాలయం పై దాడి చేసిన బీఆర్ఎస్ గుండాలపై చర్యలు చేపట్టాలని బోథ్ నియోజకవర్గం నేరడిగొండ మండల కేంద్రంలోని 7,200 తీన్మార్ మల్లన్న టీం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దిశ, నేరడిగొండ : క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న పై, కార్యాలయం పై దాడి చేసిన బీఆర్ఎస్ గుండాలపై చర్యలు చేపట్టాలని బోథ్ నియోజకవర్గం నేరడిగొండ మండల కేంద్రంలోని 7,200 తీన్మార్ మల్లన్న టీం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిజాలను నిర్భయంగా రాసి ప్రజల ముందు పెడుతున్న నికాసైన జర్నలిస్టుల పై దాడులు చేయించడం సిగ్గుచేటని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని దిక్కుతోచని స్థితిలో కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని చేసేదేం లేక చివరకు ఇలా దాడులు చేస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు.
అదేవిధంగా ఈ దాడి పై ఖండిస్తూ నేరడిగొండ మండల జర్నలిస్టులు 7,200 తీన్మార్ మల్లన్న టీంతో వెంట వెళ్లి పోలీస్ స్టేషన్లో, ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారి పక్కా ఆధారాలతో ఫోటోలతో సహాపోలీసులకు అప్పగించిన చర్యలు తీసుకోకపోతే పోలీస్ సంస్థ పై ఉన్న గౌరవం ప్రజల్లో ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో నేరడిగొండ మండల కన్వీనర్ సంతోష్, కో కన్వీనర్ ప్రవీణ్, జర్నలిస్ట్ లు తదితరులు ఉన్నారు.