లంబడాలకు ఎస్టీ హోదా రద్దు చేయాలి

తెలంగాణ రాష్ట్రంలోని లంబాడాలకు ఎస్టీ హోదా రద్దు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సెడ్మకి రామారావు డిమాండ్ చేశారు.

Update: 2024-11-10 14:25 GMT

దిశ, ఉట్నూర్ : తెలంగాణ రాష్ట్రంలోని లంబాడాలకు ఎస్టీ హోదా రద్దు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సెడ్మకి రామారావు డిమాండ్ చేశారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్ లో ఆదివారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

    ఏజెన్సీ ప్రాంతంలో జీఓ 3ను తిరిగి పునరుద్దరించాలని, ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేను ఏజెన్సీలో రద్దు చేయాలని, పలు జీఓలను అమలు చేయరాదని తీర్మానాలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర, జిల్లా నాయకులు కేవీరావు, దాట్ల నాగేశ్వరావు, ఊయిక శంకర్, చంద్రయ్య, నైతం బాలు, కామరాజు, ఈసాల సురేష్, ఆడ శంకర్, ఆడ నర్సింగ రావు, మనోహర్, షెడమకి భీంరావ్ పాల్గొన్నారు. 


Similar News