దిశ కథనానికి స్పందన..బ్రిడ్జి పైనుండి బస్సుల రాకపోకల పునరుద్ధరణ

సుద్ధ వాగు బ్రిడ్జి పైనుండి బుధవారం నుండి అధికారులు భారీ వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. గత నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలకు బ్రిడ్జి కింది భాగంలో రివిట్మెంట్ కొట్టుకుపోవడంతో

Update: 2023-08-16 04:45 GMT

దిశ,లోకేశ్వరం: సుద్ధ వాగు బ్రిడ్జి పైనుండి బుధవారం నుండి అధికారులు భారీ వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. గత నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలకు బ్రిడ్జి కింది భాగంలో రివిట్మెంట్ కొట్టుకుపోవడంతో అదే రోజు బ్రిడ్జిని పరిశీలించిన అధికారులు బ్రిడ్జి పైనుండి భారీ వాహనాలు వెళితే బ్రిడ్జి కుంగి పోయే ఆస్కారం ఉన్నదని గుర్తించిన రోడ్లు భవనాల శాఖ అధికారులు జులై 28 నుండి భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అదేవిధంగా బ్రిడ్జి మరమ్మతు పనులు పక్షం రోజుల్లో పూర్తి చేయించి వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తామని చెప్పారు. కానీ పక్షం రోజులు గడిచిన భారీ వాహనాల రాకపోకలు పునరుద్ధరించకపోవడంతో ఈనెల 14న "పూర్తికాని బ్రిడ్జి మరమ్మతు పనులు - ప్రయాణికులకు ఇబ్బందులు" అనే శీర్షికతో దిశ దినపత్రికలో మండల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కథనం ప్రచురితం అయ్యింది. దీనితో స్పందించిన అధికారులు ఈరోజు ( బుధవారం) ఉదయం నుండి భారీ వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా మండల ప్రజలు దిశ దినపత్రిక ధన్యవాదాలు తెలిపారు.


Similar News