విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

అనాదిగా అన్ని రంగాల్లో వెనుకబడిన ఆదివాసీ, గిరిజన విద్యార్థులను చదువులో ముందుకు తీసుకుని వెళ్లేందుకు గిరిజన ఆశ్రమ కళాశాలలో వారికి మెరుగైన నాణ్యమైన విద్యను అందించాలని ఆదిలాబాద్ ఎంపీ జి.నగేష్ అన్నారు.

Update: 2024-10-22 13:44 GMT

దిశ, ఆదిలాబాద్ : అనాదిగా అన్ని రంగాల్లో వెనుకబడిన ఆదివాసీ, గిరిజన విద్యార్థులను చదువులో ముందుకు తీసుకుని వెళ్లేందుకు గిరిజన ఆశ్రమ కళాశాలలో వారికి మెరుగైన నాణ్యమైన విద్యను అందించాలని ఆదిలాబాద్ ఎంపీ జి.నగేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ నుంచి మంజూరు చేసిన నిధులతో గిరిజన కళాశాలలో మంగళవారం అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ తో కలిసి ఆయన భూమిపూజ చేశారు.

    ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గిరిజన బాలికల జూనియర్ కళాశాలలో సుమారుగా 1000 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారని తెలిపారు. అదనపు తరగతి గదుల కోసం రూ.75 లక్షలతో నిర్మాణ పనులు ప్రారంభించినట్టు చెప్పారు. విద్యార్థులు ,సిబ్బందికి మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు మరికొన్ని నిధులు మంజూరు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో సుభాష్, అశోక్ రెడ్డి, ముకుందారావు, రత్నాకర్ రెడ్డి పాల్గొన్నారు. 

Tags:    

Similar News