పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి - ఏసీపీ రవికుమార్

మందమర్రి పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని బెల్లంపల్లి ఎసీపీ రవికుమార్ అన్నారు.

Update: 2024-10-21 10:11 GMT

దిశ, మందమర్రి : మందమర్రి పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. మందమర్రి పట్టణ సర్కిల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ శశిధర్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పాల్గొన్నారు. ముందుగా పోలీస్ గౌరవందనం తీసుకున్నారు. సంఘ విద్రోహ శక్తులచే పోరాడి అసువులు బాసిన అమరవీరుల పేర్లను స్మరించుకుంటూ స్థూపం వద్ద నివాళులు అర్పించారు. సిబ్బంది నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఏసీపీ రవి కుమార్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగలు మరువలేనివని, విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసులను స్మరిస్తూ అమరవీరులకు నివాళులర్పించారు.

పోలీసు అమరవీరుల వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని, దేశ రక్షణలో కుటుంబం, ప్రాణం కంటే విధి నిర్వహణ గొప్పదని చాటిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. సంస్మరణ దినోత్సవం రోజున మృతి చెందిన పోలీసు కుటుంబాల సభ్యులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. తీవ్రవాదం ఎక్కువగా ఉన్న సమయంలో అమరులు చేసిన ప్రాణత్యాగం ఫలితంగా ఈ రోజు ప్రజలందరూ స్వేచ్చగా ఉన్నారని గుర్తుచేశారు. అనంతరం పోలీస్ క్వార్టర్స్ ఆవరణలో వాలీబాల్ కోర్టు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి బెల్లంపల్లి సబ్ డివిజన్ సీఐలు, ఎస్సైలు మందమర్రి, దేవపూర్, కాసిపెట్, రామకృష్ణ పూర్ తోపాటుగా మందమర్రి సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.


Similar News