తెలంగాణలో చలిపంజా.. వణికిపోతున్న జనాలు
తెలంగాణలో ఉష్ట్రోగతలు తీవ్రస్థాయిలో పడిపోతున్నాయి.
దిశ, ఆదిలాబాద్ బ్యూరో: తెలంగాణలో ఉష్ట్రోగతలు తీవ్రస్థాయిలో పడిపోతున్నాయి. జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రంగా ఉండడంతో గజగజ వణికిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కొమురంభీం జిల్లా సిర్పూర్ లో 6.6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో 7.5 డిగ్రీలు, అర్లి (టి) లో 8 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబి లో 8.4 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జైపూర్ లో 10 డిగ్రీలుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.