గ్రామాల అభివృద్ధికి పెద్దపీట : మంత్రి సీతక్క

గ్రామాల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆ దిశగా

Update: 2024-07-01 09:57 GMT

దిశ,ఆదిలాబాద్ : గ్రామాల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, దిశగా నిధులు కేటాయించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క అన్నారు. సోమవారం ఉట్నూర్ మండలంలోని రాంలింగంపేట గ్రామం నుండి శ్యామ్ నాయక్ తండా వరకు 375 లక్షల వరకు వ్యయంతో నిర్మించిన తారు రోడ్డుతో పాటు బ్రిడ్జి ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..గ్రామాలలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు.

పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. గ్రామాల్లో అన్ని విధాలుగా సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని,సబ్బండ వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా , ఎస్పీ గౌస్ ఆలం, ఐటిడిఎ పిఓ కుష్బూ గుప్తా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News