ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టం : వెడ్మ బొజ్జు పటేల్

ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టం అని ఖానాపూర్ ఎమ్మెల్యే

Update: 2024-07-03 12:36 GMT

దిశ, జన్నారం: ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టం అని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జ పటేల్ అన్నారు. ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో బుధవారం రోజున మండల కేంద్రంలోని ఫారెస్ట్ టీడీసీ సెంటర్ లో ఎంపీపీ మాదాడి సరోజన, జడ్పీటీసీ ఎర్ర చంద్ర శేఖర్, వైస్ ఎంపీపీ సుతారి వినయ్, వివిధ గ్రామాల ఎంపీటీసీలకు ఎంపీడీవో శశికళ ఠాకూర్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేసే భాగ్యం రావడం అదృష్టంగా భావిస్తున్నామని, గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించిన అధికారుల సహకారం మరువలేనివని ఎంపీపీ మాదాడి సరోజన జడ్పిటిసి ఎర్రచంద్రశేఖర్, పలువురు ఎంపీటీసీలు అన్నారు.

ఐదేళ్ల పదవి కాలం ఎంతో సంతృప్తినిచ్చిందని జీవితకాలం గుర్తుండిపోతుందన్నారు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీటీసీలకు ప్రత్యేక స్థానం కల్పించాలని ఈ వేదికగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు.అంతేకాకుండా ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. అధికారుల సన్మానం అనంతరం వివిధ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలను సన్మానించారు. అనంతరం పదవీకాలం పూర్తి చేసుకున్న 15 మంది ఎంపీటీసీలు,ఒక జడ్పీటీసీ మొత్తం 16 మంది కలిసి టీ.డీ.సి కార్యాలయ ఆవరణలో 16 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు రియాజుద్దీన్, కో ఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీ ఖాన్, ఎంఈఓ విజయ్ కుమార్,ఎంపీవో రమేష్, వివిధ శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు


Similar News