చదువులతో పాటు విద్యార్థులకు ఆత్మరక్షణ అవసరం..

చదువులతో పాటు విద్యార్థిని, విద్యార్థులకు ఆత్మరక్షణ అవసరమని సింగరేణి కాలరీస్ కంపెనీ మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్, టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు బడికల సంపత్ కుమార్ అన్నారు.

Update: 2023-02-12 08:05 GMT

దిశ, మందమర్రి : చదువులతో పాటు విద్యార్థిని, విద్యార్థులకు ఆత్మరక్షణ అవసరమని సింగరేణి కాలరీస్ కంపెనీ మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్, టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు బడికల సంపత్ కుమార్ అన్నారు. ఆదివారం టోర్నమెంట్ ఆర్గనైజర్ మాస్టర్, రంగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక సీఐఎస్ఎఫ్ బ్యారక్ లో జాతీయస్థాయి కరాటే, కుంగ్ ఫూ ఛాంపియన్ షిప్-2023 పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు క్రీడలు అవసరమని అన్నారు. అంతేకాకుండా సౌత్ ఇండియా స్థాయి క్రీడలు మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో జరగడం ఆనందంగా ఉందని అన్నారు.

అనంతరం టోర్నమెంట్ ఆర్గనైజర్ మాస్టర్, రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ ఒకరోజు సౌత్ ఇండియా పోటీలకు దాదాపు 600 మంది క్రీడాకారులు హాజరవుతున్నారని తెలిపారు. న్యాయ నిపుణులుగా వేముల సతీష్, ఇ వెంకట్, బచ్చలి అంజన్న, ఏ రాజనర్సు, కె రమేష్ లతో పాటు 60 మంది వివిధ రాష్ట్రాలకు చెందిన రెఫరీలు పాల్గొంటున్నట్లు వివరించారు. పోటీల అనంతరం విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం ప్రశంస పత్రాలు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మెడిపెల్లి సంపత్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జె రవీందర్, మద్ది శంకర్, ఎండీ అబ్బాస్, ఓ రాజశేఖర్, రమేష్, పవన్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జీఎం శ్రీనివాస్ క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు.

Tags:    

Similar News