ఎమ్మెల్యే ప్రొటోకాల్ లొల్లి.. కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ధర్నా

ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టి..

Update: 2024-07-01 13:24 GMT

దిశ,ఆసిఫాబాద్ : ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టి.. పార్టీ కార్యక్రమంగా మార్చిన అధికారులను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ నాయకులతో కలిసి అధికారులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఆదివారం జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం సందర్భంగా రెబ్బెన నవేగాం పల్లె దవాఖాన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతో అధికారులు కాంగ్రెస్ పార్టీ ప్లెక్సీలు, బ్యానర్, పార్టీ జెండాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి పదవులు లేని కాంగ్రెస్ నాయకులను స్టేజ్ పై కూర్చోబెట్టి అధికారిక కార్యక్రమాన్ని పార్టీ మీటింగ్ లా మార్చారని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. పార్టీ అధికార మత్తులో కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు అహంకారపూరిత ధోరణి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వేణుకు అందజేశారు.

Similar News