గల్ఫ్ లో గుండెపోటుతో మండల వాసి మృతి

మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన నరేంద్రుల శివకుమార్ (42) అనే వలస కార్మికుడు బుధవారం తెల్లవారుజామున గల్ఫ్ లో మృతి చెందాడు.

Update: 2023-04-12 11:39 GMT

దిశ, జన్నారం: మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన నరేంద్రుల శివకుమార్ (42) అనే వలస కార్మికుడు బుధవారం తెల్లవారుజామున గల్ఫ్ లో మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన శివకుమార్ బతుకు దెరువు కోసం నాలుగేళ్ల క్రితం గల్ఫ్ దేశమైన అబుదాబికి దినసరి కూలీగా వెళ్లాడు. అక్కడ కూలీ పనిచేస్తూ బుధవారం ఉదయం గుండెపోటు రాగా, సహచరులు వెంటనే హస్పిటల్ తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతిచెందాడు. శివకుమార్ కు భార్య శోభతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన శివకుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని, అదేవిధంగా అతడి మృతదేహన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ప్రభుత్వం తమ వంతు సహకారం అందించాలని మృతుడి బంధువులు వేడుకుంటున్నారు.

Tags:    

Similar News