మున్సిపాలిటీ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం

మంచిర్యాల పురపాలక సంఘం అభివృద్ధికి అధికారులు, పాలకవర్గం సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.

Update: 2024-03-11 17:17 GMT

దిశ, మంచిర్యాల టౌన్: మంచిర్యాల పురపాలక సంఘం అభివృద్ధికి అధికారులు, పాలకవర్గం సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల పురపాలక సంఘం కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన 2024 - 25 ఆర్థిక సంవత్సరం సంబంధిత బడ్జెట్ ప్రత్యేక సమావేశానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ బి. రాహుల్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్ల మహేష్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పురపాలక సంఘాల అభివృద్ధి కొరకు అధికారులు, పాలకవర్గ సభ్యులు అందరూ సమన్వయంతో కృషి చేయాలని, 2024-25 వార్షిక అంచనా బడ్జెట్‌లో మున్సిపల్ సొంత వనరుల నుంచి రూ. 32 కోట్ల 91 లక్షల రూపాయల ఆదాయం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ. 25 కోట్ల 92 లక్షల రూపాయల ఆదాయం, డిపాజిట్లు రూ. 36 లక్షల రూపాయలు కలుపుకుని మొత్తం అంచనా బడ్జెట్ రూ. 59 కోట్ల 19 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు.

తెలంగాణ మున్సిపాలిటీ చట్టం - 2019 ప్రకారం మొత్తం సాధారణ ఆదాయం నుండి కార్మికుల వేతనాలు, చార్జ్ వ్యయములు, గ్రీన్ బడ్జెట్, ఇతర ఖర్చులు మొత్తం రూ. 24 కోట్ల 95 లక్షల రూపాయలు పోగా మిగులు బడ్జెట్ రూ. 2 కోట్ల 65 లక్షల రూపాయలు ఉందని, ప్రజా సౌకర్యాల కల్పన కొరకు రూ. 32 లక్షల రూపాయలు, వార్డుల వారీగా మిగులు కేటాయించి రూ. 4 కోట్ల 98 లక్షల రూపాయలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి వ్యయం రూ. 25 కోట్ల 92 లక్షల రూపాయలు, మున్సిపల్ సొంత ఆదాయం నుంచి అభివృద్ధి కొరకు 7 కోట్ల 96 లక్షల రూపాయలుగా ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని తెలిపారు. పురపాలక సంఘం పరిధిలో వివిధ రకాల పన్నులను 100 శాతం వసూలు చేయడంతో ట్రేడ్ లైసెన్స్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News