ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా.. 16 మంది విద్యార్థులకు ఉద్యోగాలు..

నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టాస్క్ అండ్ ప్లేస్ మెంట్ సెల్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేషస్పందన లభించింది.

Update: 2023-03-25 15:12 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టాస్క్ అండ్ ప్లేస్ మెంట్ సెల్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేషస్పందన లభించింది. ఇందులో ప్రముఖ ఫిరమాల్, హెటిరో కంపెనీలు నియామకాల కోసం డిగ్రీపూర్తి అయినవారికి, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న వారికి 105 మందికి పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించారు. కాగా వీరిలో పదహారు మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపిక అయిన వారికి నియమాకపత్రాలు అందజేశారు. ఈ సందర్భగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రాంగణ నియామక ఉద్యోగఅవకాశాలు వినియోగించుకొని లబ్దిపొందాలని మిగితా వారు కమ్యూనికేషన్ సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు.

ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివిన విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్ లో ఉద్యోగాలకు ఎంపిక అవడం గొప్పవిషయం అన్నారు. ఫిరమిల్ క్యాపిటల్ వనరుల విభాగాధిపతి నాగపూర్ణయ్, హేటిరో హెచ్ఆర్ దుర్గ ప్రసాద్, టాస్క్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీకాంత్ సిణా, టాస్క్ రిలేషన్ షిప్ మేనేజర్ దీప, కళాశాల టాస్క్ కో ఆర్డినేటర్ డా. ఎం.శంకర్, ప్లేస్మెంట్ సెల్ అధికారి రవికుమార్, అధ్యాకులు పీ.జీ. రెడ్డి, బి.రమాకాంత్, టి.నర్సయ్య, సరితారాణి, శ్రీహరి, మెంటర్ బి శ్రీనివాస్, దిలీప్, ఉమేష్, డా. రంజిత్ కుమార్ అభ్యర్థులు పాల్గొన్నారు.

Tags:    

Similar News