దిశ, తలమడుగు : పతంగుల పండుగ సంక్రాంతి పండుగ. ఎక్కడ చూసిన గాల్లో పతంగుల ఎగిరివేతలే మనకు దర్శనమిస్తాయి. చిన్నారులతో పాటు పెద్దవాళ్ళు కూడా పతంగుల ఎగిరేయడం మీద ఎంతో ఆసక్తి చూపిస్తారు.సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందు నుంచే పతంగుల కోలహలం జోరందుకుంది.రంగు రంగుల పతంగులు దుకాణాలలో దర్శనమిస్తున్నాయి. మరో రెండు రోజులలో పిల్లలకు సెలవులు రానున్నాయి.పిల్లల రాకతో పతంగులు మరో స్థాయిలో ఎగరానున్నాయి.పతంగులు గాల్లో ఎగురుతుంటే పిల్లల కేరింతలు ఆనందాలకు హద్దులు ఉండవు. ఒకరికి మించి ఒకరు పోటీ పడుతూ ఎగిరేస్తారు. అయితే ఈ పతంగుల ఎగిరివేత లో కొందరు ప్రమాదకరమైన చైనా మంజా ని వినియోగిస్తున్నారు.
దీని వల్ల అటు పక్షులకు మరో పక్క మనుషులకు ప్రమాదం కలిగిస్తుంది.ఈ చైనా మంజా కొన్ని కుటుంబాలలో విషాదలను నింపుతున్నాయి. దీని ద్వారా పక్షులకు మనుషులకు హాని కలుగుతుంది అని అటవీ శాఖ 2007 లో చైనా మాంజా ను నిషేదించారు. అలాగే కొన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.అందులో సరైన ప్రహరీ గోడ లేని, నిర్మాణంలో ఉన్న భవనాలు ఇండ్లు వాటర్ ట్యాంక్ ల మీద ఎక్కి ఎగిరి వేయొద్దని, రహదారుల మీద ఎక్కువ ప్రజలు సంచరించే చోట, విద్యుత్ స్తంబాలు ట్రాన్స్ఫర్లు, విద్యుత్ తీగల దగ్గర ఎగిరి వెయ్యడం చాలా ప్రమాదకరం. అలాగే చిన్న పిల్లలు ఎగిరే సందర్భంగా లో పెద్ద వాళ్ళు వారికి తోడుగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.