లీగల్ మెట్రోపాలజీ అధికారుల తనిఖీలు..
నిర్మల్ జిల్లా ముధోల్,భైంసా పట్టణ కేంద్రాలలో గురువారం తూనికలు
దిశ,భైంసా : నిర్మల్ జిల్లా ముధోల్,భైంసా పట్టణ కేంద్రాలలో గురువారం తూనికలు కొలతల శాఖ కరీంనగర్ జోనల్ (అసిస్టెంట్ కంట్రోలర్) అధికారి పార్థసారథి ఆధ్వర్యంలో పలు షాప్ లలో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...ముధోల్ మండల కేంద్రంలో రెండు కిరాణా షాపులు,రెండు స్వీట్ షాపులు,ఓ బ్యాంక్ లో తనిఖీలు నిర్వహించి సర్టిఫికేషన్ చేయనటువంటి కాంట మిషన్లను,అలాగే భైంసా పట్టణ కేంద్రంలోని మూడు కిరాణా షాప్ లో స్టాంపింగ్ లేనటువంటి కాంటలను సైతం గుర్తించి, సంబంధిత చర్యలు తీసుకున్నామన్నారు.ఆయన వెంట సంబంధిత అధికారిని భూలక్ష్మి సైతం వున్నారు.