తెలంగాణ పునర్నిర్మాణ సాధకుడు సీఎం రేవంత్ రెడ్డి

పదేళ్లు కేసీఆర్ కుటుంబ పాలనలో దగా పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేపట్టి, పేదల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డిదని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.

Update: 2024-11-08 09:47 GMT

దిశ,ఉట్నూర్ : పదేళ్లు కేసీఆర్ కుటుంబ పాలనలో దగా పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేపట్టి, పేదల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డిదని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. శుక్రవారం ఊట్నూర్ మండల కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అథితిగా హాజరై కేక్ కట్ చేసి తినిపించారు.

     సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డని పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి ఆరు గ్యారెంటీలు అందెలా కృషి చేస్తున్నారన్నారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రూపాయలను మాఫీ చేశారన్నారు. కానీ కొందరు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సీఎంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తన రాజకీయ జీవితంలో నేడు ఓ మర్చిపోని జ్ఞాపకమని గుర్తు చేశారు. జీవితాంతం సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటానన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఉట్నూరు మండలంలోని లక్కారం నుంచి పండరీపూర్ వరకు భక్తులు చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్నారు. విట్టల్, రుక్మిణి దేవతలను దర్శించుకొని పల్లకిని మోశారు. ప్రతి ఏటా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పాదయాత్ర చేపట్టి మహారాష్ట్రలోని పండరీ పూర్ విట్టల్ రుక్మిణిని దర్శించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమల్లో మాజీ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, తుకారం మహారాజ్, గిత్తే మారుతీ మహారాజ్, విట్టల్ మహారాజ్, భక్తులు పాల్గొన్నారు.


Similar News