రేపటి నుంచి ఇంటింటి సమగ్ర సర్వే

సామాజిక, ఆర్థిక, రాజకీయ,విద్య, ఉపాధి, కుల ఇంటింటి సర్వే శనివారం నుంచి జిల్లాలో పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

Update: 2024-11-08 12:31 GMT

దిశ, ఆదిలాబాద్ : సామాజిక, ఆర్థిక, రాజకీయ,విద్య, ఉపాధి, కుల ఇంటింటి సర్వే శనివారం నుంచి జిల్లాలో పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈ మేరకు శుక్రవారం సంబంధిత సర్వే మండల టీంలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా మూడు రోజుల పాటు హౌస్ లిస్టింగ్ శుక్రవారంతో ముగిసిందన్నారు. సర్వేలో ఒక్క ఇల్లు కూడా తప్పిపోకుండా చూడాలన్నారు.

    సరైన సమాచారాన్ని ఫారంలో నమోదు చేయాలని కోరారు. అదే విధంగా స్టిక్కర్ ఇంటింటికీ అతికించే క్రమంలో యజమాని పేరు, వార్డు నెంబర్, క్రమ సంఖ్య, తదితర వివరాలు సరిగా ఉన్నాయో, లేదో సరిచూసుకోవాలన్నారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు సర్వే నిర్వహించిన బ్లాక్ లో మరోసారి సరిచూడాలన్నారు. అనంతరం ఆ బ్లాక్ లో పూర్తి సర్వే నిర్వహించినట్టు అనౌన్స్ మెంట్ చేసి వీడియో రికార్డింగ్ చేయాలని సూచించారు. సేకరించిన వివరాలను కంప్యూటరైజ్డ్ చేయడానికి సుశిక్షితులైన డాటా ఎంట్రీ ఆపరేటర్ల ను నియమించినట్టు తెలిపారు. ఏమైనా సందేహాలు , సలహాల కోసం సంబంధిత ప్రత్యేక అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. 


Similar News