లోతు తెలియదు.. ప్రాణం నిల్వదు..
సొంత పనుల కోసం చెరువులోని మట్టిని ఇష్టా రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్నా అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.
దిశ, కుబీర్ : సొంత పనుల కోసం చెరువులోని మట్టిని ఇష్టా రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్నా అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు చేపడుతుండడంతో ఆ గుంతలు మళ్ళీ ప్రానాల తీసే నరక కుపాలుగా మారుతున్నాయి. కుబీర్ మండలంలోని చెరువుల్లోని మట్టిని రైతులు పంట పొలాలకు ఇతర అవసరాలకు మండల వాసులతో పాటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలకు భారీ సామర్థ్యం కలిగిన ప్రోక్లైన్లను ఏర్పాటు చేసుకొని చెరువుల్లోని మట్టిని తరలించుకు వెళ్తున్నారు. చెరువుకు జలం.. చేనుకు బలంసరే.. తవ్విన గుంతలు ప్రాణాలు తీసే నరక కుపాల్లా మారుతున్నాయి.
వర్షా కాలంలో నీళ్లు చేరి ఆ గుంతల లోతు తెలియకప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు మండలంలో ఉన్నాయి. పశువులను కడగడానికి వెళ్లి ఒకరు, పశువులకు నీళ్లు తాపటానికి వెల్లీ మరొకరు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్న వారిని చూస్తున్నాం. తవ్వకాలను రాత్రుల్లోను, మధ్యాహ్న సమయంలోను ఎక్కడపడితే అక్కడ వారికి అనుకూలమున్న ప్రదేశాల్లో తవ్వకాలు చేపడుతున్నారు. తవ్వకాలు జరిగిన విషయం గ్రామస్తులకు తెలియకపోవడంతో గుంతల లోతు తెలియక అమాయకులు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.
రెవెన్యూ అధికారులకు, మైనింగ్ అధికారులకు ఇరిగేషన్ శాఖ అధికారాలకు సమాచారం తెలిసిన చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. రైతుల ముసుగులో పొక్లింగ్, ట్రాక్టర్ల యజమానులు తమ అక్రమ దందాను కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో వీరికి ప్రజాప్రతినిధులు సైతం సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. యంత్రాల యజమానులు మాత్రం దర్జాగా దంధాను కొనసాగిస్తున్నారు. గ్రామీణ ప్రజలు ప్రమాదాల బారిన పడకుండాచూడాలని, అక్రమ్ దందాను సద్దుకోవాల్సిన అవసరం ఉంది.