పిల్లలు పుట్టడం లేదని.. 24 గంటల వ్యవధిలో భార్యాభర్తల ఆత్మహత్య
పిల్లలు లేరనే ఆ బాధ ఆ దంపతులను కడతేర్చింది. ఏళ్లు గడుస్తున్న పిల్లలు పుట్టడం లేదని తీవ్రమైన అసంతృప్తి ఒకరి తర్వాత ఒకరిని మృత్యువ చెంతకు చేర్చింది.
దిశ, బెల్లంపల్లి: పిల్లలు లేరనే ఆ బాధ ఆ దంపతులను కడతేర్చింది. ఏళ్లు గడుస్తున్న పిల్లలు పుట్టడం లేదని తీవ్రమైన అసంతృప్తి ఒకరి తర్వాత ఒకరిని మృత్యువ చెంతకు చేర్చింది. ఈ విషాదకర సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కాసిరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బెల్లంపల్లి మండలం కాసిరెడ్డిపల్లిలోని బుడగ జంగాల కాలనీకి చెందిన పత్రి గురవయ్య ఈ నెల 18 న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య వెంకటక్క సోమవారం అర్ధరాత్రి ఇంటి ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు విడిచింది. ఎంతో ప్రాణంగా ఒకరిని విడిచి మరొకరు ఉండలేని ఆ దంపతులను సంతాన లోటు మానసికంగా కుంగదీసింది. వారి మరణం భౌతికంగా ఒకరిని విడిచి మరొకరు ఉండలేని బంధాన్ని చాటింది. గురువయ్య వెంకటక్కల మరణం కాశిరెడ్డి పల్లి గ్రామం బుడగ జంగాల కాలనిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదకర ఘటన గ్రామస్తులను కన్నీటి పర్యంతం చేసింది.