ఉమ్మడి జిల్లాలో సంబురంగా హోలీ పండుగ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హోలీ పండుగ సంబరాలు జరిగాయి. మంగళవారం ఉదయం నుంచి... Holi Celebrations
దిశ ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హోలీ పండుగ సంబరాలు జరిగాయి. మంగళవారం ఉదయం నుంచి చిన్నారులు వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకుంటూ తమ సంతోషాన్ని చాటుకున్నారు. మరోవైపు పండుగ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ప్రముఖులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. వేద పండితుల సూచన మేరకు సోమవారం సాయంత్రం నుంచి పౌర్ణమి ప్రవేశించి మంగళవారం సాయంత్రం దాకా కొనసాగినప్పటికీ మంగళవారం రోజునే పండుగ చేసుకోవాలని చెప్పడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యాల కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో హోలీ వేడుకలు నిర్వహించుకున్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి ఎస్పీ ప్రవీణ్ కుమార్ తదితరులు తమ క్యాంపు కార్యాలయాల్లో రంగుల పండుగ జరుపుకున్నారు. తమ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, స్థానిక ప్రముఖులు, కలెక్టర్, ఎస్పీ నివాసాలకు వెళ్లి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. సిర్పూర్ కాగజ్నగర్ లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇచ్చోడలో బోత్ శాసనసభ్యులు రాథోడ్, బాపూరావు ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే జోగు రామన్న తదితరులు హోలీ వేడుకల్లో పాల్గొని కార్యకర్తలు హుషారుగా గడిపారు.