తాండూర్లో అభివృద్ధి పనులు ప్రారంభం

మండలంలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు.

Update: 2024-12-24 10:17 GMT

దిశ, తాండూర్ : మండలంలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. రేచీని గ్రామంలో రూ.3 కోట్ల సీఆర్ఆర్ నిధులతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు, రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, తాండూర్ లో రూ.25 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ అనిల్ కుమార్, పార్టీ నాయకులు సూరం రవీందర్ రెడ్డి, గట్టు మురళీధర్ రావు, పేరం శ్రీనివాస్, ఎండీ. ఈసా, బానయ్య, బండి పోషం, భాస్కర్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 


Similar News